# Tags

ఆవాసం అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం :రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్ రావు 

 జగిత్యాల

శ్రీ వాల్మీకి ఆవాసం (జగిత్యాల) అభివృద్ధికి “గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ 50 వేల రూ.విరాళం అందజేసింది.

జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ శ్రీ వాల్మీకి ఆవాసం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి యోగ్యులుగా ఎదగాలని, సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ సాయిని రాంగోపాల్రావు అన్నారు.

గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో వాల్మీకి ఆవాసం ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో రాంగోపాల్ రావు తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, ఆవాసం ప్రతినిధులు మల్లేశం, కమలాకర్ రావు, చిత్తారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు .

ఈ సందర్బంగా తన అల్లుడైన రమణ గండ్ర అమెరికా లోని అట్లాంటాలో ఉంటూ,ఆయన తండ్రి  గండ్ర రాంగోపాల్ రావు స్ఫూర్తితో ఉన్నత స్థాయికి చేరుకోగలిగాడన్నారు.

ఈనేపథ్యంలో…. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అధ్యక్షులు నవీన్ బత్తిని, చైర్మన్ నవీన్ ఉజ్జని, కార్యదర్శి కీర్తిధర్ తోపాటుగా ఉపాధ్యక్షుడిగా రమణ గండ్ర సంఘటితంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

ఈ సందర్భంలో, వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా, 50 వేల రూపాయలు వాల్మీకి ఆవాసం విద్యార్థుల అభివృద్ధి కోసం సొసైటీ పేరిట అందించారని రాంగోపాల్ రావు ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన చెక్కు ను ఆవాసం ప్రతినిధులకు ఈ సందర్బంగా వెంటనే అందించారు.గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ అందించిన ప్రోత్సాహంతో విద్యార్థులు యోగ్యులుగా ఎదగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.