# Tags

సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం : జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2-30 గంటల ప్రాంతంలో జిల్లా విద్యాధికారి కే. రాము ప్రారంభించారు.

ఈ సందర్బంగా డి ఈ ఓ రాము మాట్లాడుతూ…ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా సంఘటితంగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు.

అలాగే బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరించిన గొడ్డండ్ల రాజగోపాల్, మ్యాలపు మురళిను ప్రత్యేకంగా డీఈఓ అభినందించారు. ఈ పాఠశాలకు అభివృద్ధి కొరకు గతంలో సహకరించిన వారి విధంగానే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని డీఈవో గారు అభినందించారు.

అనంతరం దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గారు, దాతలు గొడ్డండ్ల రాజగోపాల్ గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.