# Tags
#తెలంగాణ

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల హనుమాన్ దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

శ్రావణమాసంలో తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శివశాస్త్రి, అనుపమ్ లు స్వామివారికి చందనం పెట్టి అలంకరణ చేశారు.

అనంతరం గ్రామంలో భజన బృందం పాటలు పాడుతూ వీధుల గుండా తిరిగి సంకీర్తనలు పాడుతూ స్వామివారి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఓర్సు రాజేందర్ స్వామి వారికి 10 వేల రూపాయల విలువ గల మైక్ సిస్టం అందజేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేయగా మహిళలు మంగళహారతులతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లద్దునూరి హనుమాన్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య నాయకులు నిమ్మ నారాయణరెడ్డి సిరిపురం మహేందర్ నిమ్మ సుధాకర్ రెడ్డి బొమ్మిడి రాజలింగం. మోతే కిషన్ రెడ్డి. నిమ్మ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు