# Tags
#తెలంగాణ

మత్తడి దూకుతున్న ఎగువ మానేరు.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు…

రాజన్న సిరిసిల్ల జిల్లా( తెలంగాణ రిపోర్టర్) : సంపత్ కుమార్ పంజ…..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం వద్దగల ఎగువ మానేరు మత్తడి దూకి దిగవకు పరవళ్ళు తొక్కుతుంది.


గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి పాల్వంచ వాగు, వచ్చి చేరడంతో మత్తడి దూకి నీటి ప్రవాహంతో పరవాళ్ళు తొక్కుతుంది. 1945- 51 సంవత్సరాల మధ్యలో ఏడవ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ అప్పటి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ పాపయ్య నేతృత్వంలో ప్రాజెక్టు నిర్మించారు. 3000 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నిలువ సామర్థ్యం కలిగి 14,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించారు.

32 ఫీట్ల ఎత్తున రిజర్వాయర్ 2,717 అడుగుల స్పిల్ వే,10,700 అడుగుల పొడవు గల కట్టతో 5.48 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండేలాగా నిర్మించారు. నిజామాబాద్ జిల్లా పాల్వంచ వాగు,మెదక్ జిల్లా కూడావెళ్లి వాగు ఈ ప్రాజెక్టుకు జీవనాధారం.

ఈ వాగులు ఎగువ నుంచి ఉదృతంగా వచ్చి చేరడంతో మానేరులో పూర్తిస్థాయి నీటిమట్టం నిండి మత్తడి దూకుతూ పరవాళ్ళు తొక్కుతుంది. దిగువకు నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సందర్శలుకులు ఎవరు కూడా ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా దూరం నుండి సందర్శించే విధంగా పోలీసు శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారు..