# Tags
#తెలంగాణ

బంజారాలకు ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

(సంపత్ కుమార్ పంజ : రాజన్న సిరిసిల్ల జిల్లా

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం తీజ్ ఉత్సవంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బంజారాలకు వారి హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు లో. బంజారాలు కీలక పాత్రను పోషించడం జరిగిందన్నారు.గతంలో వారి హక్కులను కాల రాసిందని అన్నారు.

దేశవ్యాప్తంగా 9.8 బంజారా జాతులు ఉన్నారని వారికి ప్రభుత్వపరంగా చట్టపరంగా అన్ని హక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ నాయక్ సకారం నాయక్ రామచంద్రనాయక్ పరిసరాం నాయక్ రవి నాయక్ రెడ్డి నాయక్ హరిదాస్ నాయక్. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య ఏజీపీ కృష్ణ నాయకులు చెన్ని బాబు బండారి బాల్ రెడ్డి కొత్తపల్లి నరసింహులు మండే శ్రీనివాస్ పడిగేల రవీందర్ గిరిధర్ రెడ్డి మర్రి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గుర్రం రాములు తదితరులు పాల్గొన్నారు