# Tags

విద్యాలయం ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి :కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పాఠ్యాంశాలు నిత్యం చదివించాలి..కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

రాజన్న సిరిసిల్ల జిల్లా :

ముస్తాబాద్ మండలం లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసారు.


విద్యాలయాల ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో కిచెన్, స్టోర్ రూమ్ ఇతర గదులు అన్నిటిని తిరిగి వంటకాలను, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో అందిస్తున్న అన్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ తరగతులను పరిశీలించారు. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ సమస్య ఏర్పడినదని ప్రిన్సిపాల్ తెలుపగా పై అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

8,9,10 విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ పాఠాలను బోధించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తా చెదారం లేకుండా చూడాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు. విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.