# Tags

మల్కపేట రిజర్వాయర్ ను నింపాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కోరిన కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా):-

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసి మలకపేట రిజర్వాయర్ ను నీటితో నింపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ….మిడ్ మానేరు నుండి పదవ ప్యాకేజీకి నీటిని తీసుకెళుతున్నందున మనం కూడా మల్కపేట రిజర్వాయర్ ను మూడు టీఎంసీలకు నింపుకుంటే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

గతంలో మాదిరిగా ఎల్లారెడ్డిపేట మండలంలోని కొన్ని గ్రామాలలో పంట చివరి దశలో నీటి ఎద్దడి కాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కల్పించుకొని పంట పొలాలకు నీటిని విడుదల చేయించడం జరిగిందన్నారు.

అదే మాదిరిగా రిజర్వాయర్లో నీటిని నింపి ఉంచితే రైతుల అవసరాల దృశ్య నీటిని విడుదల చేసుకొని పంటలు పండించుకోవడానికి మార్గం సుగమవుతుందని అన్నారు.స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇరిగేషన్ శాఖ సీ ఈ తొ మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు.ఈ మేరకు ప్రభుత్వ విప్ కు ఎల్లారెడ్డిపేట మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపామని అన్నారు.

ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లూరు బాపురెడ్డి ఉన్నారు..