# Tags

జర్నలిస్టుల హక్కుల సాధనకై కలిసికట్టుగా పోరాటం చేద్దాం: లాయక్ పాషా

రాజన్న సిరిసిల్ల జిల్లా : సంపత్ పంజా :


తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే హెచ్ -143 జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు లాయక్ పాషా

ఎలక్ట్రానిక్ మీడియా టెంజు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం గంభీరావుపేట మండలం నర్మాల లో మంగళవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టుల హక్కుల సాధింపు కోసం, సంక్షేమం సాధన, సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టు సమాజం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.

ప్రభుత్వం తరఫున రావలసిన హెల్త్ కార్డులు ఇంతవరకు రాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలన్నారు. అక్రిడిటేషన్ కార్డుల పొడగింపు విధానానికి స్వస్తి పలికి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి నూతన కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం నివేశన స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను జిల్లా కమిటీ తీవ్రంగా పరిగణించింది.

జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. మండలాల వారీగా టీయూడబ్ల్యుజే హెచ్ 143 యూనియన్ ను బలోపేతం కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సామల గట్టు, మహమ్మద్ అజీమ్, ఉపాధ్యక్షులు రేగుల రాంప్రసాద్, పరశురాం ,అనిల్ కుమార్, కోశాధికారులు అందే దేవేందర్, సయ్యద్ ఖలీమ్, కార్యదర్శులు షేక్ రియాజ్, బాలరాజు, మోహన్, సలావుద్దీన్, శేఖర్ రెడ్డి, పంజా సంపత్ కుమార్, రమేష్, బాబు, లతోపాటు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.