# Tags

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారసులదే..సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ

  • * ఉమ్మడి కుటుంబ వ్యవస్థే వృద్ధులకు రక్షణ
    **న్యాయ సహాయం కోసం సేవా కేంద్రం ఏర్పాటు

తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి వారసులే తీసుకోవాలని జగిత్యాల జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

జగిత్యాల జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని నివేదిత వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధుల న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.

ప్రభుత్వ చట్టాలపై, వయోవృద్ధుల సంరక్షణ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.

వృద్ధాశ్రమంలోని మౌలిక వసతులను పరిశీలించి సలహాలు అందించి వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకొని పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సివిల్ లా ప్రకారం నిరాశ్రుయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు న్యాయ సలహాలు అందించేందుకు అనాధాశ్రమంలో వృద్ధుల న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

వారానికి ఒకసారి లాయర్లు వృద్ధాశ్రమాన్ని సందర్శిస్తారని తమ సమస్యలు వివరిస్తే మీ తరఫున న్యాయపోరాటం చేస్తారని తెలిపారు.

మీ సమస్యలకు వారధిగా అడ్వకేట్ ను కేటాయించమని సంబంధిత న్యాయవాదికి సమస్యలను తెలుపాలన్నారు.

తల్లిదండ్రులను పోషించే బాధ్యత పిల్లలదే అని బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల యొక్క నైతిక,చట్టపరమైన బాధ్యత అని న్యాయస్థానాలు, ప్రభుత్వ అధికారులకు మీ సమస్యలను తెలుపాలన్నారు.

తల్లిదండ్రులకు ఆస్తులున్నా లేకున్నా పిల్లలే వారిని పోషించాలని,ఆస్తులను పిల్లలకు రాయడం తప్పేనని పేర్కొన్నారు. 

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.ఉమ్మడి కుటుంబ వ్యవస్థే వృద్ధులకు రక్షణ అని పెద్దలను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వయోవృద్ధుల సంరక్షణ చట్టాలున్నాయని తల్లిదండ్రుల పేరట ఉన్న ఆస్తిని వారసులు తీసుకొని సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే స్థానిక తహసిల్దార్,ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే సంరక్షణ ఖర్చులతో పాటు వారసుల వద్ద నుండి ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో రెండో తరగతి న్యాయమూర్తులు గంప కరుణాకర్,ఏజిపి ఓం ప్రకాష్,లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ చంద్ర మోహన్,పి.సతీష్,విజయ్ కృష్ణ,ఏ పి పి బిట్ల నర్సయ్య,ప్యానల్ అడ్వకేట్ గోనె భూమేశ్వర్ పారిపెల్లి లక్ష్మీనారాయణ,పిఎల్ వి గంగరాజాం, తదితరులు పాల్గొన్నారు.