# Tags

ఐ మాస్ లైట్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం

రాజన్న సిరిసిల్ల జిల్లా

ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఎస్డిఎఫ్ నిధుల కింద లక్ష రూపాయలతో ఏర్పాటు చేసిన ఐ మాస్ లైట్ ను ఆదివారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ , గుండారం గ్రామంలో నాలుగు లక్షల రూపాయలతో ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణం కూడా చేశామన్నారు సుమారు 30 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు.

రానున్న రోజుల్లో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్రెడ్డి మహిళా సంఘ భవనాన్ని కూడా మంజూరు చేస్తారని అన్నారు గుండారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 184 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు ప్రస్తుతం 100 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు ఎక్కడ లేని విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి 12 వేలు వేశామన్నారు గుండారం గ్రామం అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాగా ఉంటుందని రానున్న రోజుల్లో అన్ని విధాలుగా గుండారం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలపడం జరుగుతుందన్నారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి డైరెక్టర్లు వివిధ సూడిద రాజేందర్ మిండే శ్రీనివాస్ నాయకులు నేలపల్లి శ్రీనివాస్ భాస్కర్ రాజు నాయక్ జజ్జరి దేవేందర్ పడగల రవీందర్ వెంకటేష్ మూర్తి శ్రీనివాస్ రాథోడ్ నర్సయ్య నారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు