హిందువుగా గర్వపడే పండుగ వినాయక చవితి… ఎన్ని కోట్ల మందికి అన్నం పెడుతుందో…
చిన్న లెక్క
వినాయక విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకూ ఎంత మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి…?
మట్టి తవ్విన దగ్గరి నుంచి, ఆ మట్టి తయారిదారుకు చేరే వరకూ…
మట్టి తవ్వే వాడు, మట్టి తోలే ట్రాక్టర్లు, అందుకు మనుషులు
ఇనుము అమ్మేవాళ్ళు, రాడ్ బెండింగ్ వాడు, ఇనుము తోలే వాళ్ళు
విగ్రహానికి కావాల్సిన రంగులు, ఇతర ముడి పదార్ధాలు ఇలా తయారు అయ్యే వరకూ… విగ్రహానికి రంగులు వేసేవాళ్ళు…
అక్కడి నుంచి మండపానికి విగ్రహం రావడం, ఆ విగ్రహం తీసుకు రావడానికి కూలీలు, క్రేన్లు, లారీలు…
స్టేజీ కట్టే వాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళు, పువ్వులు సమకూర్చేవాళ్ళు, విగ్రహం అలంకరించడానికి వస్త్రాలు అమ్మే వాళ్ళు, వాటిని ప్రత్యేకంగా తయారు చేసే వాళ్ళు…
విగ్రహం వచ్చిన తర్వాత పూజలు… ఆ పూజల్లో వాడే పువ్వులు, పళ్ళు, స్వీట్లు ఇలా ఎంత మందికి…?
స్టేజీకి కరెంటు, డెకరేషన్ లైట్లు, మైక్ సెట్లు, వాటిని అద్దెకు ఇచ్చే వాళ్ళు, వాటిని అమర్చే వాళ్ళు, ఎలక్ట్రీషియన్లు…
జెనరేటర్లు, బ్యాటరీలు అద్దెకు ఇచ్చే వాళ్ళు… వాటిని నిత్యం దగ్గరుండి మెయింటెన్ చేసే వాళ్ళు…
విగ్రహం వద్ద లడ్డూలు పెట్టే వాళ్ళు, వాటిని తయారు చేసే వాళ్ళు…
ఈ లోపు అన్నదానాలు చేస్తారు… సరుకులు అమ్మేవాళ్ళు, వంటలు వండే వాళ్ళు కేటరింగ్ చేసే వాళ్ళు… ప్లేట్లు, గ్లాసులు, వాటర్ సప్లై చేసే వాళ్ళు… అక్కడ శుభ్రం చేసే వాళ్ళు..
విగ్రహం నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు డీజేలు పెట్టే వాళ్ళు… అందుకోసం బ్యాండు మేళం వాయించే వాళ్ళు…
అన్నదానాల పేరుతో కూటికి లేనాళ్ళు ఈ 11 రోజులు కడుపు నిండా తింటారు…
విగ్రహం వెళ్ళేటప్పుడు భారీ క్రేన్లు, ట్రాక్టర్లు, లారీలు ఆటోలు… ఇలా ఎన్నో ఎన్నో…
ప్రభుత్వానికి కట్టే ఫీజులు, పెట్రోలు భారీగా ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం…
గత ఏడాది మంగళవారం ఒక్క రోజునే కేవలం హైదరాబాద్‍లో దాదాపు రెండు లక్షల విగ్రహాలు ఊరేగించారు, నిమజ్జనం చేసారు…
మళ్ళీ ఆ వ్యర్ధాలు తీయడానికి ప్రత్యేక బృందాలు… అది కూడా భారీ పని…
ఇక ఇళ్ళల్లో పూజలు చేసుకునే వాళ్ళు ఎన్ని కోట్ల మంది…? ఎన్ని విగ్రహాలు కొంటారు…?
పత్రి అమ్మేవాళ్ళు, పాలవెల్లి అమ్మేవాళ్ళు, తాళ్ళు అమ్మేవాళ్ళు… స్వీట్లు అమ్మే వాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు… రైతులు… ఇలా ఎందరికి ఉపాధి…?
డప్పు కొట్టే వేల మందికి ఇప్పుడు కడుపు నిండుతుంది.. డీజే పెట్టే వాళ్ళు.. వారిలో ఏ సామాజిక వర్గాలు ఉంటాయో తెలుసు..
లడ్డూ వేలం పాటలు భారీగా జరుగుతాయి… ఆ డబ్బులు అన్నీ అభివృద్ధి కార్యక్రమాలకు వాడతారు…
గత ఏడాది బాలాపూర్ లడ్డూ 30 లక్షలు… అలా ఎన్ని లక్షల లడ్డూలకు వేలం పాట…?
ఇలా ఎన్నో లక్షల లడ్డూలను వేలంపాట వేస్తారు..
పూజలు చేసే పూజారులు, ఎన్ని లక్షల దేవాలయాల్లో ఉంటారు…?
అంటే ఎన్ని లక్షల మంది మతాలు, కులాలతో సంబంధం లేకుండా ఉపాధి పొంది ఉండవచ్చు…?
ఇది పండుగ అంటే… పండుగ అంటే పది మంది కడుపు నింపేది అనడానికి వినాయక చవితి ప్రత్యక్ష ఉదాహరణ…
ఒక దేవుడిపై ఉన్న నమ్మకం ఇన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా భోజనం పెడుతుంటే అంతకంటే ఏం కావాలి…?
హైదరాబాద్‍లో చార్మినార్ వద్ద చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది… దేవుడు లేడు అనే వెదవలకు చెప్పలేం…
దేవుడు ఉన్నాడు కాబట్టే అంతమందికి ఉపాధి దొరుకుతుంది…
సేకరణ : గుళ్ళపల్లి వెంకట్రామయ్య గోడ నుంచి..(through sravanthi bellamkonda)
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





