# Tags

మిడ్ మానేరు లోనీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టువే కాళేశ్వరం నీళ్లు కాదు :కాంగ్రెస్ నాయకులు

(తెలంగాణ రిపోర్టర్):

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష కోట్లు దోసుకోడానికే కాళేశ్వరం కట్టారని
కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం , ఎడ్ల రాజ్ కుమార్ లు అన్నారు.


ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో మిడ్ మానేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటితో నిండి పోతే కాలేశ్వరం నీళ్లతో నిండి పోయిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మిడ్ మానేరు వద్ద సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం ప్రజలందరికీ అర్థమయిపోయిందన్నారు.


గత పది సంవత్సరాలుగా సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ చేసింది ఏమీ లేదన్నారు. దళితులని ఇబ్బందులకు గురి చేయడం తప్ప మరేమీ లేదన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎడ్ల రాజకుమార్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల మూలంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటితో నిండిన మిడ్ మానేరు వద్దకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం వెళ్లి కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీటితో నిండిందని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు , బిఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయకులు కొందరు బిఆర్ ఎస్ పార్టీ గురించి గొప్పలు చెబుతూ అధికార కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణ చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.


కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకం తొక్కుతామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాటిమాటికి అంటుంటే ప్రజలే వారిని గత ఎన్నికల్లో పాతాళ లోకానికి తొక్కారని ఆయన గుర్తు చేశారు.


ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామిరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ భాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ మల్లారెడ్డి బండారి బాల్రెడ్డి, కదిరే శ్రీనివాస్ గౌడ్, మధు యాదవ్ గంట బుచ్చ గౌడు తదితరులు పాల్గొన్నారు