# Tags

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు :SI రాహుల్ రెడ్డి


(తెలంగాణ రిపోర్టర్): సంపత్ :


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్ షబ్బీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ పట్టుకున్నారు.

ఎలాంటి అనుమతి పత్రాలు చూపించనందున అదుపులోకి తీసుకున్నారు. పంచనామా నిర్వహించి అట్టి ట్రాక్టర్ డ్రైవర్ ని ఇసుక ట్రాక్టర్ తో సహా పోలీస్ స్టేషన్ కు తరలించగా ఎల్లారెడ్డిపేట ఎస్సై కె. రాహుల్ రెడ్డి కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ ని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు పంపినట్లు ఎస్సై తెలిపారు .

ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించినారు..