# Tags

సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్ -ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

  • ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలి
  • రాయికల్ లో పెన్షన్ దారుల సన్నాహాక సదస్సు

రాయికల్:

ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లక్షల మంది తరలిరావాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

రాయికల్ మండల కేంద్రంలో శివాజీ రెడ్డి గార్డెన్ లో జరిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ….

వికలాంగులకు 6 వేలు, సమస్త చేయుత పెన్షన్ దారులకు 4000 రూపాయలు సెప్టెంబర్ 8 లోపే పెంచాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 9న హైదరాబాద్ చేరుకొని ప్రభుత్వం నిలదీస్తామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడు తెలుసుకుంటామని మహాజననేత హెచ్చరించారు.సెప్టెంబర్ 9న హైదరాబాదుకి లక్షలాదిమంది తరలిరావాలని పిలుపునిచ్చారు.ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దుమల గంగారం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, రాయికల్ మండలం ఇంచార్జ్ నక్క సతీష్, కో ఇంచార్జి పొడేటి సునీల్, మండల అధ్యక్షుడు దొబ్బల వేణుగోపాల్, దివ్యాంగుల మండల అధ్యక్షులు సామర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మహేష్, ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిసాన్, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, బొల్లె అనిల్, జిల్లా కార్యదర్శి సంగెపు మత్తు, మీసాల సాయిలు, బెక్కం వెంకటేష్, పాల్గొన్నారు.