# Tags
#తెలంగాణ

బిఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడింది :బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నరసయ్య

( తెలంగాణ రిపోర్టర్) :


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మంగళవారం బిఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి బయటపడిందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు ,కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి ల అవినీతిని జస్టిస్ గోష్ కమిషన్ బయటపెట్టిందన్నారు. ఇప్పటికైనా నిజా నిజాలు ఒప్పుకొని ప్రజల మధ్యకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ధర్నా చేయడం సిగ్గుచేటు అన్నారు.సాక్షాత్తు వారి కుటుంబంలోని సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ ఈ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించడం జరిగిందన్నారు.

ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు,,మాజీ ఎంపీపీ కృష్ణ హరి,మాజీ సర్పంచ్ అందే సుభాష్, ఆరోపణలు ఎంత మాత్రం నిజం లేదని అన్నారు.సామాన్య నాయకులు బిఆర్ఎస్ పార్టీ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీలోని హరీష్ రావు, కేటీఆర్, కవితలకు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరాబేగం, వైస్ చైర్మన్ గుండాటి రామ్,రెడ్డి డైరెక్టర్లు మెండే శ్రీనివాస్,సూడిద రాజేందర్ ,తిరుపతిరెడ్డి ,గొల్లపల్లి లక్ష్మారెడ్డి ,నాయకులు గంట బుచ్చగౌడ్,బండారి బాల్ రెడ్డి, చిరం నాగరాజు, పడగల రవీందర్,కదిరి శ్రీనివాస్,ముక్కా శంకర్ పాల్గొన్నారు..