# Tags

మల్కాపేట రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసిన అధికారులు

(తెలంగాణ రిపోర్టర్): సంపత్

రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేట రిజర్వాయర్ లోకి మధ్య మానేరు నుండి నీటిని అధికారులు మంగళవారం ఒక పంపు ద్వారా విడుదల చేశారు.

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ప్రయత్నించి మలకపేట రిజర్వాయర్ లోకి నీటిని తెచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగిందని అన్నారు .

ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల ప్రజల పక్షాన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు మలకపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలను ఇరిగేషన్ ఈ ఈ కిషోర్, డి ఈ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గత పంట కు 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించి పంటను కాపాడిన ఆపద్బాంధవుడు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అని అన్నారు. సందర్శించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి డైరెక్టర్ మిండే శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లూరు బాపిరెడ్డిలు ఉన్నారు