మంథని :
సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు.

శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు.
లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వ వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగాలు లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురికి సంతోష కారణమని అన్నారు.
కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే, ఒక ప్రక్క కోర్టుకు, మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని, ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు, సమయం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియరు సివిల్ జడ్జి శ్రీమతి వి భవాని, అడిషనల్ జూనియరు సివిల్ జడ్జీ కమారి ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి న్యాయాది కారిణి శ్రీమతి అనురాధ ,రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ బి సురేష్,గోదావరిఖని ఎసిపి శ్రీ మడత రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు హరి బాబు,తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





