# Tags

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్

కోరుట్ల, సెప్టెంబర్ 17:

పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా వెళ్తున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు పునరంకితమై పని చేద్దామని జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్ అన్నారు.

కోరుట్ల పట్టణ సినారే కళాభవన్ “పోషణ్ భీ పడాయి భీ” పై కథలాపూర్, కోరుట్ల పట్టణ,కోరుట్ల మండలానికి చెందిన అంగన్ వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ నిర్వహించారు.

మూడవ రోజైన బుధవారం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిగా పాల్గొన్న ఐసీడీఎస్ పీడీ డాక్టర్ నరేష్ మాట్లాడుతూ పోషకాహార లోపం లేని భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా పోషణ్ అభియాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ 2018 లో ప్రారంభించారని పోషకాహారం, పిల్లల అభివృద్ధి ఫలితాలలో మెరుగుదలను వేగవంతం చేయడం ఈ పథకాన్ని లక్ష్యం అని తెలిపారు.

అంగన్‌వాడీ పోషణ్ 2.0గా మార్చారని, 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కౌమారదశలో ఉన్న బాలికలకు పోషకాహారాన్ని అందిస్తుందన్నారు. పిల్లలు, తల్లుల పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తాయి – ప్రీ-స్కూల్, విద్య, పోషకాహార లోపం లేని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణానికి పునరంకితమై పని చేయాలని డాక్టర్ నరేష్ పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ సీడీపీఓ కాసుపాక మణెమ్మ, సూపర్ వైజర్లు అలవాల భారతి, టీ. శోభారాణి, కథలాపూర్, కోరుట్ల పట్టణ, మండలాల చెందిన అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.