# Tags

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరంను పర్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

జగిత్యాల :

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, ఆపీ సంస్థల సహకారంతో ఒమేగా మరియు సుశ్రుత క్యాన్సర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు.

బుధవారం ఉదయం  11-30 నుండి మధ్యాహ్నం 4గంటల వరకు దరూర్ క్యాంపు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ వైద్య పరీక్షల శిబిరంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ …జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అవగాహనా సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ తో పాటుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ప్రమోద్ కుమార్, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా ఎన్. శ్రీనివాస్,జిల్లా ఆసుపత్రి RMO డా.గీతిక, ఇంచార్జి సూపరింటెండెంట్ డా .సుమన్, డా అర్చన, మెడికల్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మరియు సుశృత-ఒమేగా హాస్పిటల్ ఆంకాలజీ సర్జన్ డా.రణదీప్ రెడ్డి, డా. దీప్తి, మార్కెటింగ్ అధికారి రాజేందర్,

కార్యక్రమం నిర్వాహకులు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ, రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, రోటరీ క్లబ్ సభ్యులు కొత్త ప్రతాప్,రాజు, మరియు మాజీ కౌన్సిలర్ లు కుసరి అనిల్,ముస్కు నారాయణ రెడ్డి తోపాటు దుమాల రాజ్ కుమార్,  ఎల్ జీ రమేష్, వంశీ బాబు, ప్రవీణ్ రావు,శేఖర్,రహమాన్,వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీమతి బి. ఎస్ లత మాట్లాడుతూ…

క్యాన్సర్ ను ఎర్లీ స్టేజ్ లో గుర్తించడానికి ఎన్నో రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ అవకాశం ను వినియోగించుకోవాలని సూచించారు. 

ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అదేవిధంగా వారి ఆరోగ్యం కోసం ప్రతి జిల్లా కేంద్రంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం పది బెడ్లను కీమోథెరపీ చికిత్స కోసం వెళ్ళే దూర భారాన్ని తగ్గించడం కోసం కేటాయించిందని తెలిపారు.జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాలతో కూడిన మరో ఆసుపత్రి భవన నిర్మాణం తదితర సౌకర్యాల  కోసం 200 కోట్ల రూ. వ్యయంతో మంజూరు చేసిందని వివరించారు.

జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మాట్లాడుతూ ఒమేగా మరియు సుశ్రుత హాస్పిటల్స్ యొక్క ప్రముఖ వైద్యులు డాక్టర్ రణదీప్ రెడ్డి,ఈ కార్యక్రమానికి రావడం పట్ల అభినందనలు తెలిపారు.

https://public.app/video/sp_kailz3mvulgsx?utm_medium=ios

అలాగే, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (HDS),  రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, ఆపీ సంస్థలు నిర్వహిస్తున్న వైద్య శిభీరాలు, రక్త దాన శిభిరాలు మరియు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు వివరించారు.