# Tags

ఏసీబీ కి చిక్కిన సర్వేయర్-రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: (సంపత్ పంజా)

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. ​

జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలమేరకు…..

భూమి సర్వే పనుల నిమిత్తం బాధితుడి నుంచి 20 వేలరూ.లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ​

బాధిత రైతుకు చెందిన చిన్న బోనాల ప్రాంతంలోని 3 ఎకరాల భూమి సర్వే కోసం సర్వేయర్ వేణు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొదటగా 10 వేల రూ.లు తీసుకున్న వేణు, సర్వే పూర్తయిన తర్వాత మిగిలిన 20 వేల రూ.లు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ​

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ ట్రాప్ విజయవంతమైంది. సర్వేయర్ వేణును అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.