మంథని నియోజకవర్గం

మంథని నియోజకవర్గంలోని నరసింహ శివకిరణ్ గార్డెన్స్ లో లోక్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మరియు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధ్యక్షతన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” కార్యక్రమం మంగళవారం జరిగింది..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్,
ఏఐసీసీ పరిశీలకులు డా.కే. జయ కుమార్, కేతురి వెంకటేష్, ఖాజా ఫక్రుద్దిన్ పాల్గొన్నారు.

అలాగే TPCC జనరల్ సెక్రటరీ రాజేష్ కాశీపాక గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ కార్యక్రమం ద్వారా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మంథని, అంతర్గం మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా లోని ధర్మారం, రామగుండం మండలం అధ్యక్షులు, మరియు రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులను పార్టీ శ్రేణుల మెజారిటీతో ప్రకటించడం జరుగుతుంది..

“సంఘటన్ శ్రీజన్ అభియాన్ తెలంగాణ” – పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, ఎస్సి, బీసీ సంఘాల నాయకులు మరియు మాజీ ఎం.పి.పి, జడ్పీటీసీ,సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు
భారీ సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు..

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





