# Tags

సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన

జగిత్యాల:

జగిత్యాల ధరూర్ జడ్ పి హెచ్ ఎస్ క్యాంప్ పాఠశాలలో విద్యార్థుల కోసం పోలీస్ శాఖ సైబర్ క్రైమ్ నేరాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు మురళి పాల్గొని మాట్లాడుతూ….విద్యార్థినీ విద్యార్థులు టెక్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చిన ఎలాంటి లింక్ ఓపెన్ చేయకూడదని, ఇంట్లో తల్లిదండ్రుల ఫోన్ వాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగి మన అకౌంట్ నుండి డబ్బులు పోయినట్లైయితే వెంటనే 1930 కు కాల్ చేయాలని తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత, గంగయ్య, షబానా, ప్రభాకర్, షకీల్, ప్రవీణ్, అనూజ, మనోహర్, కిరణ్, బ్లూ కోట్ సిబ్బంది రాజేందర్, జలీల్ పాల్గొన్నారు.