# Tags

మొట్టమొదటిసారి మహిళా క్రికెట్ వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. 💐🇮🇳 శుభాకాంక్షలు

ఫైనల్ మ్యాచ్ లో విలువైన 87 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా, ఈ టోర్నమెంట్ లో 22 వికెట్లు, 215 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచింది దీప్తి శర్మ.

వీళ్లకు తోడుగా టోర్నమెంట్ ఆసాంతం జట్టును నడిపించిన హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ భారత మహిళా జట్టు ప్రపంచ ఛాంపియన్ గా నిలిపింది.

దేశంలో మహిళా క్రికెట్ వన్డే ప్రపంచకప్ జరుగుతున్నా కూడా పెద్దగా ఆసక్తి లేకుండే కానీ సెమీ ఫైనల్లో ఏడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మీద కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ చేసిన 88 పరుగులకు తోడు, జెమిమా రోడ్రిగ్స్ చేసిన అద్భుతమైన సెంచరీ 127తో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ కి చేరడం వలనే మహిళా క్రికెట్ మీద ఆసక్తి పెరిగింది.

భారత మహిళా క్రికెట్ జట్టు నూతన ఛాంపియన్ గా అవతరించడంతో దేశంలో ఇకమీదట మహిళా క్రికెట్ పట్ల కూడా ఆదరణ కూడా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జయహో భారత్! జై హింద్!