సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన దీప్తి శర్మ
సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగంకు ప్రతీకగా నిలబడిన అదే అమ్మాయి ఈనాడు దేశానికి మొదటి మహిళా విశ్వకప్ ను గెలిపించింది. ఆ అమ్మాయే దీప్తి శర్మ

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా కు 9 .కి.మీ. దూరంలోని శహగంజ్ లో అవధ్ పురి అనే చిన్న ఊరు.
అక్కడ నిమ్న మధ్యతరగతి ఇంట్లో అన్నా చెల్లెలు. మీడియం పేస్ బౌలర్ అయిన అన్న భారత్ తరఫున ఆడాలని కలలు కన్నాడు. ఆ కల నెరవేరడం అసంభవమని తెలియగానే తన కలను చెల్లెలిద్వారా నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు… జీవనానికి ఆధారమైన ఉద్యోగానికి తిలాంజలి పలికి చెల్లెలి శిక్షణకు తనను తాను సమర్పించుకున్నాడు.

సోదరుడి ప్రతిజ్ఞ, త్యాగం ప్రతీకగా నిలబడిన అదే అమ్మాయి ఈనాడు దేశానికి మొదటి మహిళా విశ్వకప్ ను గెలిపించింది. ఆ అమ్మాయే దీప్తి శర్మ
మహిళా ప్రపంచకప్- 2025 లో 58 పరుగులు, 5 వికెట్లు, ఒక రనౌట్ … మొత్తం టోర్నీ లో 215 పరుగులు 22 వికెట్లు … సాధనకు కలశం పెట్టినట్లు ‘ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ‘ కిరీటం…
దీప్తి శర్మ అన్న సుమిత్ శర్మ ఉత్తరప్రదేశ్ కు చెందిన క్రికెట్ ఆటగాడు… అన్నతో బాటు చిన్న వయస్సులోనే క్రికెట్ ప్రాక్టీసు కు వెళ్తుండిన దీప్తిశర్మ అన్న కలను నెరవేర్చింది.

సోదరుడితోబాటు క్రికెట్ ప్రాక్టీసు కు వెళ్ళిన దీప్తిశర్మ ఒకరోజున భారత మాజీ క్రికెటర్ హేమలతా కలా కంట్లో పడింది. అది కూడా అకస్మాత్తుగా… అన్న ,అతడి స్నేహితులు ప్రాక్టీస్ చేస్తుండగా దీప్తిశర్మ వాళ్ళకు ఫీల్డింగ్ చేస్తోంది. 50 మీటర్ల దూరం నుండి తను విసిరిన ఒక బంతి నేరుగా స్టంప్ లను తాకింది. అది చూసిన హేమలత కలా కు ఆశ్చర్యం..

అమ్మాయిని తన శిక్షణ బృందంలో చేర్చుకుంది. దీప్తిశర్మ క్రికెట్ ఆసక్తిని ప్రోత్సహించమని అన్న సుమిత్ శర్మకు సూచించింది హేమలత. తన కలను పక్కకు సర్ది చెల్లెలు క్రికెట్ జీవితానికి వెన్నెముక అయ్యాడా అన్న. ఆమె పాలిట అన్నే మొదటి క్రికెట్ గురువు. 13 ఏళ్ళకు ఉత్తరప్రదేశ్ అండర్- 19 జట్టు… 17 ఏళ్ళకు భారత జట్టులో పాదార్పణ.అదే అమ్మాయి ఇపుడు భారత్ ప్రపంచ కప్ గెలుపుకు విజయశిల్పి

అవును, సోదరుడి త్యాగం వ్యర్థం కాకుండా చూసుకున్న చెల్లెలు దేశానికి ప్రపంచకప్ ను అందించింది.
అవధ్ పురి గ్రామంలోకి ప్రవేశించగానే ఒక వీధి కనబడుతుంది. దాని పేరు ‘ Arjuna Awardee Cricketer Deepti Dharma Marg’ . ఆ ఊరికి ఆమె పేరే ల్యాండ్ మార్క్.

source: fb
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





