# Tags
#తెలంగాణ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో శశి భూషణ్ కాచే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమీటీ ఎన్నికల కమిషన్ కో ఆర్డినేషన్ కమీటీలో సభ్యుడిగా మంథనికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశిభూషణ్ కాచే మరోసారి నియామకమయ్యారు.

ఈ మేరకు అఖిల భారత కాంగ్రేస్ కమీటి తెలంగాణ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ కమారి మీనాక్షి నటరాజ్ అనుమతితో 13 మంది సభ్యులతో పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తేది 3-11-2025 రోజున నియామకపు ఉత్తర్వు జారీ చేసారు.

ఈ కమీటీలో తిరిగి తన పేరును సిఫారసు చేసిన ఐటి&పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ,పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు కు, ఛైర్మన్ పి. రాజేష్ కుమార్ కు , నియమించిన పిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్ కు శశి భూషణ్ కాచే ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.