# Tags
#జగిత్యాల

అనవసరమైన రాద్ధాంతం అది :మంచాల కృష్ణ, గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఊటూరి రమేష్, దారం గోపి


జగిత్యాల

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న 138 సర్వేనెంబర్ లోని 20 గుంటల స్థలానికి సంబంధించి “కిబాల (Qibala)” విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసిన అంశంపై పట్టణంలోని వివిధ వర్గాల వారు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

అనవసరమైన రాద్ధాంతం చేస్తూన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నాము.

గత 74 సంవత్సరాల క్రితం మున్సిపల్ ద్వారా కొనుగోలు చేసిన ఈ సర్వే నెంబర్ లోని 20 గుంటల భూమి అంశాన్ని పదేపదే 100 కోట్ల ఆస్తి ఆక్రమణ అని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న సరికాదు.

“కిబాల (Qibala)” అర్థమును ప్రతి ఒక్కరూ పరిశీలించి అర్థం చేసుకోవాలని కోరుతూ వివిధ వర్గాలతో పాటు పత్రికల వారు సైతం ఒకే నినాదంతో ఆక్రమణ పేరిట వార్తలు రాస్తూ ఉండడం కూడా సరైనది కాదు.

ఏదైనా ఒక సమస్య ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అధికార యంత్రాంగం విచారించడం తప్పనిసరి, అధికారుల విచారణ, పరిశీలనకు కూడా తాము ఎప్పుడూ, ముందు ఉంటూ, ఏ సమయంలో కూడా అడ్డుకోలేదన్న విషయాన్ని కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాము.

138 సర్వే నంబర్ పై వస్తున్న ఆరోపణలపై అధికార యంత్రాంగం పరిశీలన ఒక వైపు చేస్తుండగానే, మరోవైపు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండడం సమంజసం కాదని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాం.

ఇప్పటికైనా ఈ అంశంపై మాట్లాడుతున్న వివిధవర్గాలవారు, పత్రికల వారు “కిబాల (Qibala/Kibala/Kabala)” విక్రయపత్రం అర్థమును, న్యాయస్థానముల ఆదేశాలను అవగాహన చేసుకోవాలని, Revenue Dictionary, Google ద్వారా గ్రహించాలని కోరుతున్నాము.

ఇట్లు :
మంచాల కృష్ణ, గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్, ఊటూరి రమేష్, దారం గోపి.

👉 (నోట్ :అమ్మకపు దస్తావేజు సందర్భంలో, ఖబాలా (కబాలా లేదా కేవాలా అని కూడా పిలుస్తారు) అనే పదం ఉర్దూ మరియు అరబిక్ పదం, ఇది అమ్మకపు దస్తావేజును సూచిస్తుంది, లేదా మరింత ప్రత్యేకంగా, యాజమాన్యం మరియు ఆస్తి యొక్క చట్టపరమైన బదిలీకి రుజువుగా పనిచేసే పత్రాన్ని సూచిస్తుంది.

అమ్మకపు దస్తావేజులో “ఖబాలా”/ qibala/కిబాల
ఇది ఒక అధికారిక చట్టపరమైన పత్రం, ఇది అమ్మకందారుడు (బదిలీదారుడు) స్థిరాస్తి యాజమాన్యాన్ని అంగీకరించిన ధరకు కొనుగోలుదారు (బదిలీదారు)కి బదిలీ చేసే లావాదేవీని నమోదు చేస్తుంది.

యాజమాన్య రుజువు:
అమ్మకం పూర్తయిన తర్వాత ఆస్తిపై కొనుగోలుదారు యొక్క చట్టపరమైన హక్కుకు ఖబాలా ప్రాథమిక సాక్ష్యం.