# Tags
#తెలంగాణ #జగిత్యాల

జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం…


జగిత్యాల

కలెక్టరేట్లో దిశ సమావేశం:

మంగళవారం జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.

దిశ కమిటీ చైర్మన్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిధిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యూఐడిఎఫ్, ధాన్యం కొనుగోల్లు, అమృత్ 2.0, పిఎం సూర్య ఘర్, ముద్ర లోన్, స్త్రీనిధి, పిఎం విశ్వకర్మ, పిఎం ఈజిపి, పిఎం ఎఫ్ఎంఎఫ్, నేషనల్ హెల్త్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, ఎన్ఎల్ఎం, ఎన్ ఎఫ్బిఎస్ పలు కేంద్ర పథకాలపై దిశ కమిటీ సభ్యులు ఏ. భిక్య నాయక్, వడ్డెపెల్లి శ్రీనివాస్, పాత రమేష్, ఎర్ర లక్ష్మి లతో కలిసి సమీక్షించారు.

ఈ సమావేశంలో దిశ కమిటీ చైర్మన్, ఎంపి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ...

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో తో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఏ పార్టీకి చెందిన వారైనా, ఎవరైనా జిల్లా అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని ఎంపి అరవింద్ తెలిపారు.

మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.


ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ

జగిత్యాల కు నవోదయ గురుకుల పాఠశాల మంజూరుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కొరకై ఎంపి అరవింద్ ను పలుమార్లు కలిసి అనేక అభివృద్ధి పనులకొరకు చర్చించడం జరిగిందని తెలిపారు.

 ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో  ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. 

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.


రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు.ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు లక్ష్యాన్ని మించి సాధించామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ

దిశ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే, కమిటీ సభ్యులు తెలిపిన కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మంజూరైనా అభివృద్ధి పనులు జిల్లా అధికారులందరూ సమన్వయంతో సకాలంలో పూర్తి చేయవలసిందగా ఆదేశించారు.

దిశ కమిటీ సభ్యులు మాట్లాడుతూ….

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని తెలిపారు.

యుఐడిఎఫ్:

జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో లో గల పలు అభివృద్ధి పనుల సమస్యల పై అధికారులతో సమీక్షించారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

వరి ధాన్యం కొనుగోల్లు:

జిల్లాలో ఖరీఫ్ పంట అధికంగా పండిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో తగిన వసతులు కల్పించాలని తెలిపారు.
అదేవిధంగా అవసరమైన చోట నూతన కొనుగోల్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

అమృత్ 2.0:

జిల్లాలో అమృత్ 2.0 ఎంపికైన 5 మున్సిపల్ పరిధిలో గల నీటి వసతులపై సమావేశంలో కమిటీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానం తెలిపారు.
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

పి.ఏం సూర్య ఘర్ :

సోలార్ పథకం ద్వారా జిల్లాలో 174 మంది 1,33,44,000 రూపాయల లబ్ది.జిల్లాలో 23 గ్రామాలను మాడల్ సోలార్ గ్రామాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు.

ముద్ర లోన్ :

జగిత్యాల జిల్లాలో రూ. 285 కోట్లు మంజూరై 34,249 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని తెలిపారు.
రూ. 50,000 నుండి రూ. 20 లక్షల వరకు జామీను లేకుండా లోన్లు అందజేయబడుతున్నాయని తెలిపారు.

బ్యాంకులు అర్హత మరియు ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యతను పరిశీలించి హాసిల్ ఫ్రీ విధానంలో మంజూరు చేస్తున్నారు.కొన్ని కేసుల్లో సిబిల్ స్కోర్ తక్కువగా ఉండటం వల్ల తిరస్కరణలు జరుగుతున్నాయని తెలిపారు.

పీఎం విశ్వకర్మ :

పిఏం విశ్వకర్మ యోజన లో లోన్ మంజూరులో సహకారం లేని అంశాన్ని గమనించామని తెలిపారు.
అన్ని బ్యాంకులకు అర్హులైన కస్టమర్లకు త్వరితగతిన లోన్లు మంజూరు చేయాలని సూచించారు.
కస్టమర్ల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఏదైనా శాఖల స్థాయిలో ఆలస్యం జరిగితే, శాఖాధిపతులతో వ్యక్తిగతంగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నేషనల్ హెల్త్ మిషన్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 8
ప్రాథమిక ఉప కేంద్రాలు 16
ఆయుష్మాన్ భారత్ కింద 3,48,605 తో 105% టార్గెట్ సాధించారని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు సమాకూర్చాలని ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండలని తెలిపారు.

పిఎం గ్రామీణ సడక్ యోజన :

12 రోడ్డులు, 5 బ్రిడ్జి లకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.

నేషనల్ లైవ్ స్టాక్ మిషన్

157 దరఖాస్తులకు గాను 42 రుణాలు అందించగా మిగతావి పరిశీలనలో ఉన్నవి.

నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కిం :

191 మంది దరఖాస్తులు రాగా 167 మంది లబ్ధిదారులకు 26,60,000 రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు.

పిఎం మత్స్య సంపద యోజన :

ఈ పథకానికి 45 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజా గౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్,జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.