# Tags

జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోల శుభాకాంక్షలు

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసినందున జిల్లా కలెక్టర్ కు జగిత్యాల టీఎన్జీవోలు శుభాకాంక్షలు తెలిపారు.


ఇటీవల జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను, అదనపు కలెక్టర్లు శ్రీమతి బి ఎస్ లత మరియు రాజగౌడ్ లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ సమయానుకూలంగా తగు సూచనలు చేస్తూ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూసినందుకు జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలయజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఎన్నికలు మొత్తం పూర్తయ్యేంతవరకు అన్ని స్థాయిల ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కష్టపడి పనిచేసినందుకు ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా ముగిసిందని, జిల్లాలోని ఉద్యోగులందరి సమిష్టి కృషి వలననే సాధ్యమైందన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా నాయకులు ఎండి. మహమూద్, సాహెద్ బాబు, రవీందర్, రాజేందర్, రవి కుమార్, రాములు, రాజేశం, సునీత్ కుమార్, ప్రమోద్, శైలజ, శ్రావణి, విజయలక్ష్మి, అరుణ, ఉద్యోగులు పాల్గొన్నారు.