# Tags

మంథని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్

మంథని:

కోర్టు ప్రాంగణంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి వి భవాని మాట్లాడుతూ….

లోక్ అదాలత్ ద్వారా రాజీయే రాజమార్గంగా పలు కేసులు పరిష్కారం అయితే, కోర్టుల కు భారం తగ్గి తీవ్రమైన నేరాలు సత్వరం పరిష్కరించవచ్చని, క్షణికావేశంలో చేసిన నేరాలకు జరిమానాలు,రాజీ ద్వార పరిష్కారం దొరుకుతుందన్నారు.

సివిల్ కేసులలో రాజీ చేసుకున్న సందర్బంలో కోర్టు ఫీజులు తిరిగి ఇవ్వబడుతాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ శ్రీమతి ఏ సుధారాణి, ఎపిపి సందీప్ రెడ్డి, బార్ అసోషియేషన్ ఉపాధ్యక్షులు కె రఘోతం రెడ్డి, లోక్ అధాలత్ సభ్యులు కటుకం శ్రీనివాస్, డి.విజయ్ కుమార్, కనుకుంట్ల స్వామి, న్యాయవాదులు శశిభూషణ్ కాచె, కె. వ్యాస్ కుమార్, సిరివెన్నెల, గోదావరిఖని 2వ పట్టణ సీ.ఐ.ప్రసాద్ రావు, మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ ఎస్ఐ లు డేగ రమేష్, రవికుమార్, శ్రీనివాస్, ప్రసాద్, వివిద బ్యాంకుల అధికారులు,కక్షి దారులు పాల్గొన్నారు.