# Tags

పంచాయతీలకు నేరుగా డిల్లీ నుండి నిధులు-గ్రామాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల : రాయికల్ : (ఎస్.శ్యామ్ సుందర్):

  • ఉపాధి హామీ పథకం గ్రామాలకు వరం

  • * ప్రభుత్వ విధి విధానాల కనుగుణంగా పాలన సాగాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

పంచాయతీలు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండ, 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలకు ఢిల్లీ నుండి నేరుగా అభివృద్ధికి నిధులు వచ్చేలా రూపకల్పన చేసింది నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

సోమవారం రాయికల్ మండలంలో అల్లిపూర్, ఉప్పు మడుగు,అయోధ్య, మైతాపూర్ గ్రామాల్లో సర్పంచ్ ల ప్రమాణ స్వీకరణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… నేను లేనిది గ్రామాల అభివృద్ధి ఎక్కడినుండి చేస్తారని అనేటోళ్లు ఉన్నారని, మీ ఓట్లప్పుడు అడ్డుగా తిరిగారని పరోక్షంగా ఆరోపించారు.

గ్రామపంచాయతీ అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రత్యక్షంగా కేంద్రం 15 వ ఆర్థిక నిధులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి, గ్రామాల అభివృద్ధికి వరం లాంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గ్రామపంచాయతీల అభివృద్ధి జరుగుతుందని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించాలని, పల్లెలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిందన్నారు.

ఈ పథకం తోనే గ్రామాల్లో హరితహారం,డంపింగ్ యార్డ్,వైకుంఠధామం,సిసి రోడ్లు,మరుగుదొడ్లు,పాఠశాల భవనం నిర్మాణం లాంటి పనులను చేపట్టినట్లు తెలిపారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో మక్కల కొనుగోలు చేపట్టామని, ఎకరాకు 18 క్వింటాళ్లు సూచించడంతో అధిక దిగుబడితో రైతులు నష్టపోతున్నారని, మొక్కజొన్న రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఎకరాకు 25 క్వింటాళ్లు మక్కలను కొనుగోలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కి లేఖ రాయడంతో ప్రభుత్వం నిర్ణయంతో మక్కలు ఎకరాకు 25 క్వింటాళ్లు కొనుగోలు చేపట్టడం జరిగిందన్నారు.

నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య,మాజీ జెడ్పిటిసి గోపి మాధవి రాజారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, నూతన సర్పంచులు తలారి నాగమణి రాజేష్,ఏంబారి గౌతమి, కొత్తకొండ రోజా, సిరిపురం లక్ష్మి, బోదాసు చంద్రశేఖర్, ఆకుల అంజయ్య గౌడ్,పరాచ శంకర్, నాయకులు తంగెళ్ల రమేష్, మహిపాల్ రెడ్డి, నరసయ్య, భూమయ్య, అత్తినేని గంగారెడ్డి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.