# Tags

తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు 👉”ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” 

హైదరాబాద్ :

తెలంగాణ దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజరామయ్యర్ శుభాకాంక్షలు..

బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డిని మర్యాదపూరకంగా కలిసి పుష్పగుచ్చమందించారు. దేవాదాయ శాఖ అంశాలు, రానున్న 2027-పుష్కరాలు, చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై చర్చించారు.

తెలంగాణలో ఇకపై “ప్రజావాణి” తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం

“ధర్మవాణి” పేరిట దేవాదాయశాఖలో ప్రతి సోమవారం ప్రజావాణి తరహా కార్యక్రమం

“ధర్మవాణి” పేరుతో ప్రత్యేక వారాంత గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు ప్రకటించారు.

ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి
డైరెక్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ కార్యాలయంలో ప్రజావాణి తరహాలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రతి వారం నిర్వహించబడుతుంది.

ఎవరు హాజరు కావచ్చు?
దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు, ఈఓలు, డీసీలు, ఏసీలు స్థాయి సిబ్బంది, ఇతర సంబంధిత స్టేక్‌హోల్డర్లు

పరిష్కార విధానం :
నిజమైన సమస్యలు తక్షణం లేదా వారం రోజుల్లో పరిష్కారం

హెడ్ ఆఫీస్, DC, AC, EO స్థాయిలో పెండింగ్ ఉన్న అంశాలు క్లియర్ చేయడం జరుగుతుంది.

పరిష్కారం అనంతరం దరఖాస్తుదారులకు సమాచారం అందుతుంది.

పరిష్కరించలేని పరిస్థితిలో కారణాలను స్పష్టంగా తెలియజేస్తారు.

దేవాదాయ శాఖలో పారదర్శకత పెంచడం,
సమస్యలపట్ల వేగవంత పరిష్కారం, అర్చకులు మరియు ఉద్యోగుల నమ్మకం పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.హనుమంతరావు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *