# Tags
#తెలంగాణ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో నంబర్ వన్ గా నిలవాలి..మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సమావేశాలు..(ముడికే కనకయ్య) :

👉 తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం..ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది..

👉 గ్రామాల స్వరూపాన్ని మారుద్దాం..ఇందిరమ్మ ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..

👉 ప్రత్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి..

👉 పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపని గ్రామాలకు ఎంత పెద్ద పనైనా చేసి పెడతా..

👉 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి..ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి..రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండలాల స్థాయి సమావేశాల్లో మంత్రి అధికారులకు ఆదేశాలు..

ప్రగతి ప్రణాళికను సమిష్టి కృషితో సక్సెస్ చేస్తాం..గ్రామాల్లో సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి..కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి సైదాపూర్ మండలాలను నంబర్ వన్‌గా నిలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో జరిగిన సన్నాహక సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో జిల్లా మండల స్థాయి అధికారులు ఆయా మండలాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని దీంతో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు మండల జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. వేవంతంగా పనులు పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు పంపని గ్రామాల్లో ఎంత పెద్ద పనైనా చేసి పెడతానని హామీ ఇచ్చారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని పేర్కొన్నారు. గ్రామాల్లో విద్య వైద్యము ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తోపాటు తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలనీ ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.

చిగురుమామిడి లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ అధికారుల మందిరము సమిష్టిగా కృషి చేసి కరీంనగర్ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు తాగునీటి సమస్య రాకుండా మిషన్ మోడ్ పనిచేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని నిధులు నిధుల వినియోగంపై పకడ్బందీ ప్రణాళిక అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు.

ప్రజల్ని కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. 99 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గ్రామాలను సమూలంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో పల్లెలను ప్రగతి పథంలో పయనించేలా చూస్తామన్నారు. ఆయా మండలాలకు సంబంధించి అధికారులు వివరాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలోస్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డీవో కే మహేశ్వర్ డిపిఓ జగదీశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీధర్ జిల్లా వైద్యాధికారి వెంకట రమణ సంక్షేమ అధికారి సరస్వతి హౌసింగ్ పిడి శ్రీనివాస్ స్పెషల్ ఆఫీసర్లు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *