# Tags

గాంధీ చౌక్ లో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ పై అవగాహన 

రాయికల్ : (శ్యాంసుందర్.s):

గాంధీ చౌక్ ప్రాంతంలో మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో రోడ్లు శుభ్రపరచి ప్లాస్టిక్ నివారణ పై అవగాహన 

👉 పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ, వైద్య శిభిరం

పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ ఛైర్మెన్ కట్కం రవీందర్ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం రాయికల్ పట్టణంలో ఛైర్మెన్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్లు శుభ్రపరచి ప్లాస్టిక్ నివారణ పై అవగాహన కల్పించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ చేసి,ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వినియోగం చేసుకోవాలని అన్నారు.పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వారి ఆరోగ్యం,భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

పని ప్రదేశంలో పారిశుద్ధ్య కార్మికులకు భౌతిక గాయాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా అందించిన “వ్యక్తిగత రక్షణ పరికరాలు” భద్రత కల్పిస్తాయని వాటిని వినియోగించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు,వైస్ చైర్మన్ తురగ సౌజన్య,కౌన్సిలర్ పుర్రె శ్రీధర్,రాకేష్,వైద్యులు డాక్టర్ అనిల్,మేనేజర్ వెంకటి,నాయకులు తురగ శ్రీధర్,మచ్చ శేఖర్,తోపారపు సురేష్,వేముల రాము, వార్డు అధికారులు ప్రత్యూష, వైద్య సిబ్బంది సంతోష్,రమ,వరలక్ష్మి, మెప్మా సిబ్బంది ,పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *