# Tags

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ మరియు జగిత్యాల క్లబ్ సహకారంతో రక్తదాన శిబిరం

జగిత్యాల :

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ సహకారంతో క్లబ్ ఆవరణలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి డా. ఎన్. శ్రీనివాస్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు శ్రీమతి డాక్టర్ దీపిక విజయ్, జగిత్యాల క్లబ్ కార్యదర్శి రాంగోపాల్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ సిరిసిల్ల శ్రీనివాస్, సభ్యులు కొమురవెల్లి వేణుగోపాల్, ఆంటోనీ ముత్తు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు అధ్యక్షులు ఏవి ఎల్ ఎన్ చారి, కార్యదర్శి రాజు, సభ్యులు టీవీ సూర్యం, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు మరియు జగిత్యాల క్లబ్ జాయింట్ సెక్రటరీ సామ హేమందర్ రెడ్డి, ట్రెజరర్ ఏ. వెంకటరమణ, క్రీడా కార్యదర్శి పి.అమిత్ కుమార్, సభ్యులు సంజయ్ సామ్రాట్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ నేవీ క్లాసెస్ సొసైటీ – రోటరీ క్లబ్ జగిత్యాల క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రజోపయోగకరమైనవని వివరించారు.

ప్రధానంగా రక్తదాన శిబిరం ఎంతో మంది ప్రాణాలు కాపాడే కార్యక్రమం అని అన్నారు.

ఇటీవల తాము సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగులకు జైపూర్ కృత్రిమ కాలు అందజేసే కార్యక్రమంలో 86 మంది లబ్ధి పొందారని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో 73 సార్లు ఇప్పటివరకు రక్తదానం చేసిన కనపర్తి రవి అనే యువకుడిని డాక్టర్ దీపికతో పాటు రెడ్ క్రాస్, రోటరీ మరియు క్లబ్ సభ్యులు అభినందించారు