# Tags

సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సంపత్ పి
సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నిర్వహకులపై కేసు నమోదు

దసరా పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో “100 కొట్టు మేకను పట్టు” అనే క్యాప్షన్ తో అమాయక ప్రజల వద్ద నుండి డబ్బులను వసూలు చేస్తూ మేక, రైస్ కుక్కర్, కోళ్లు, పట్టుచీర, 10 గ్రాముల వెండి నాణం అను బహుమతులు ఇస్తామని మోసం చేస్తున్న శ్రీకాంత్, ప్రశాంత్, మహేందర్, వెంకటేష్ మరియు స్వామి అను వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎవరు చీటీలు, ప్రైజ్ మనీ ల పేరుతో మోసపోవద్దని తెలిపారు..ఇటువంటివి మరేమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఎస్పీ తెలిపినారు.