# Tags
#తెలంగాణ #జగిత్యాల

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం…

జగిత్యాల :

-మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కడం లేదన్న నైరాష్యం,

-సముదాయించిన జీవన్ రెడ్డి 

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పరిస్థితి వివరించిన జీవన్ రెడ్డి 

జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ బి-ఫారం పంచాయితీ సోమవారం రాత్రి వరకు కూడా ఎటూ తేలకపోవడంతో,  కౌన్సిలర్ అభ్యర్తిగా నామినేషన్ వేసిన ఓ కాంగ్రెస్ కార్యకర్త  పార్టీ టికెట్ రాదేమోనన్న అనుమానం

తోఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నా నికి పాల్పడడంతో  వాతావరణం ఒక్క సారి వేడెక్కింది.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, జగిత్యాల మున్సిపల్ 16 వ వార్డు ఎస్సీ జెనరల్ కు రిజర్వు ఐయింది. ఆ వార్డులో బొల్లి శేఖర్ అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జీవన్ రెడ్డి  అనుచరుడు ఆ వార్డులో నామినేషన్ వేశాడు.

అయితే జీవన్ రెడ్డి – డా సంజయ్ కుమార్ ల మధ్య బి -ఫారం ల పంచాయితీ ఎటూ తేలకముందే సోమవారం మధ్యాహ్నం మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద ఆకస్మికంగా ఈ ఘటన జరగడంతో, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  బొల్లి శేఖర్ 

ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వ్యక్తికే 16 వ వార్డులో కాంగ్రెస్ టికెట్ ఖాయం చేస్తున్నారన్న ప్రచారం తట్టుకోలేక ఆకస్మికంగా ఉన్నట్టుండి,  వెంట తెచ్చుకున్న పెట్రోల్ సీసా తీసి తలపై పోసుకుని, జేబులోనుండి అగ్గిపెట్టె తీసే యత్నంలో అది గమనించి, అక్కడే ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటుగా కొందరు వెంటనే తేరుకొని, ఆ ఘటనను అడ్డుకోవడంతో, పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనతో జీవన్ రెడ్డి ఒక్కసారి ఉలిక్కిపడి, తీవ్ర భావొద్వేగానికి గురయ్యాడు.

శేఖర్ ను మందలించి, టికెట్ గురించి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం మంచిది కాదని సముదాయించారు. 

జీవన్ రెడ్డి వెంటనే పరిస్థితిని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. 

కాగా, 16వ వార్డు టికెట్ ఆశించిన బొల్లి శేఖర్ తీవ్ర ఆవేదనకు గురై జీవన్ రెడ్డి ఇంటి ఆవరణలోనే పెట్రోల్ ఒంటిమీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలిసి టికెట్ పై జరుగుతున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశానని, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని మీడియా ముందు వెల్లడించాడు.

మరో కొద్దీ గంటల్లో పార్టీ టికెట్ ఏ వార్డులో ఎవరికీ వస్తుందో చూడాలి. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *