#టెక్ న్యూస్

నిత్యా కమ్యూనికేషన్స్‌లో ఫెస్టివల్ లక్కీ డ్రా – 5G స్మార్ట్‌ ఫోన్‌ను గెలుచుకున్న వినియోగదారుడు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిత్య కమ్యూనికేషన్స్‌లో ఫెస్టివల్ లక్కీ డ్రా – OPPO A59 5G స్మార్ట్‌ ఫోన్‌ను గెలుచుకున్న వినియోగదారుడు

-కస్టమర్ జి మహేష్‌కి స్మార్ట్‌ఫోన్‌ను అందించిన
నిత్యా కమ్యూనికేషన్స్ యజమాని గుండా రాజేందర్

జగిత్యాల

ఉగాది మరియు ఈద్ శుభ సందర్భంగా, పట్టణంలోని నిత్యా కమ్యూనికేషన్స్, మొబైల్ షాప్ లో అద్భుతమైన పండుగ ఆఫర్‌ల ద్వారా ఒక కస్టమర్‌ ను అదృష్టం వరించి…ఆనందాన్ని అందించింది.

నిత్యా కమ్యూనికేషన్స్ లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన మల్యాల మండలం వెంగళాపూర్ కు చెందిన జి మహేష్ అనే కస్టమర్, స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్‌లో మరో మొబైల్ స్మార్ట్ ఫోన్ OPPO A59 5G ను గెలుచుకుని, ఆనందంలో మునిగిపోయాడు.

ఈ సందర్భంగా….
నిత్యా కమ్యూనికేషన్స్ యజమాని గుండా రాజేందర్, మరియు OPPO సేల్స్ ఎగ్జిక్యూటివ్ శివ లు కస్టమర్ జి మహేష్‌కి స్మార్ట్‌ఫోన్‌ను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

స్మార్ట్‌ఫోన్‌ను అందుకున్న జి మహేష్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉందంటూ, ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన, నిత్యా కమ్యూనికేషన్స్‌కి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, ” నిత్యా కమ్యూనికేషన్స్” ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆఫర్‌లు అందిస్తూ, అసాధారణమైన సేవలతో తన వినియోగదారులను ఆహ్లాదపరుస్తూనే ఉంటుందని గుండా రాజేందర్ స్పష్టం చేశారు.అలాగే, ప్రతి పండుగ సీజన్‌ను చిరస్మరణీయమైన మరియు బహుమతినిచ్చే అనుభవంగా నిత్యా కమ్యూనికేషన్స్ అందిస్తుందని అన్నారు.

నిత్యా కమ్యూనికేషన్స్‌లో ఫెస్టివల్ లక్కీ డ్రా – 5G స్మార్ట్‌ ఫోన్‌ను గెలుచుకున్న వినియోగదారుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *