#politics

జగిత్యాలలో గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయి విచారణ – మంత్రి శ్రీధర్ బాబు

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేసిన గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కుటుంబానికి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.. జగిత్యాల గ్రామీణ మండలం జాబితాపూర్‌కు చెందిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి ఈ నెల 22న హత్యకు గురి కాగా గంగారెడ్డి కుటుంబాన్ని మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం రాత్రి 8-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్‌ టాకూర్ తో కలిసి పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంగారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు.. తాను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డీజీపీతో, జిల్లా ఎస్పీతో మాట్లాడన్నారు.. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా పూర్తి విచారణ జరుగుతుందన్నారు.. నిందితుడికి పోలీసులతో ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.
అలాగే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.గంగారెడ్డి హత్యా ఘటనతో ప్రజల సమక్ష్మమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు జీవనరెడ్డి ఆవేదన చెందినతీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడానన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *