# Tags

విధుల్లో చేరిన పూర్తి స్థాయి మండల పశు వైద్యాధికారి

(తెలంగాణ రిపోర్టర్): రాజన్న సిరిసిల్ల జిల్లా…సంపత్ కుమార్ పంజ…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి గా జంపాల రాహుల్ పూర్తి స్థాయి మండల పశు వైద్యాధికారి గా విధుల్లో చేరారు.వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ కి చెందిన రాహుల్ 2015-2020 వరకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ,2020-2022 వరకు మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పి వి నరసింహ రావ్ వెటర్నరీ యూనివర్సిటీ లో పశు వైద్య శాస్త్రం పూర్తి చేశారు.కాగ ఇక్కడ ఇంచార్జీ పశు వైద్యాధికారి గా పనిచేసిన రేణుక పూర్తిస్థాయి పశు వైద్యాధికారి గా మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామ పశు వైద్యాధికారి గా విధులు నిర్వహించనున్నారు.కాగ రాహుల్ కు వీర్న పల్లి మండల పశు వైద్యాధికారి గా అదనపు భాద్యతలు నిర్వహించనున్నారు. విధుల్లో చేరిన పశు వైద్యాధికారి రాహుల్ మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పశువులకు వైద్యం అందిస్తానని అన్నారు.