# Tags
#తెలంగాణ #జగిత్యాల

తల్లీ బిడ్డకు ఘనంగా సన్మానం


జగిత్యాల జిల్లా

జిల్లా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ICDS కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్–2 సూపర్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి శైని కుమార్తె ప్రతిభ ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో ఉత్తీర్ణులై డి.ఎస్.పి (Deputy Superintendent of Police) హోదాలో ఉద్యోగం పొందిన సందర్భంగా తల్లీ బిడ్డలు శాఖపరంగా ఘన సత్కారం అందుకున్నారు.


ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ ప్రతిభను మరియు ఆమె తల్లి శైని లను అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బోనగిరి నరేష్ మాట్లాడుతూ,
“మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిబ్బందిలోంచి ప్రతిభావంతమైన విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో విజయాన్ని సాధించి పోలీసు విభాగంలో ఉన్నత స్థానం పొందడం తమ శాఖకు గర్వకారణం అన్నారు. ఇది ప్రతి ఉద్యోగికి ఒక ప్రేరణాత్మక ఘట్టం అన్నారు.

మహిళా సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి విజయాలు సాధిస్తే, అది సమాజంలో స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుంది” అని అన్నారు.

ఈ సందర్బంగా DSP ప్రతిభ మాట్లాడుతూ,
“తమది చాలా పేదరిక కుటుంబం….చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం….నా విజయానికి ప్రధాన కారణం మా అమ్మ అన్నారు. ఆమె చేసిన త్యాగాలు, కష్టాలు నాకు ప్రేరణ అనీ, ఆమె ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గొద్దని నేర్పిందన్నారు.

ఈరోజు నేను సాధించిన ఈ విజయం ఆమె ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది” అని భావోద్వేగంగా తెలిపారు.

ప్రతిభ తల్లి శైని మేడం మాట్లాడుతూ,
“మా పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ నా కూతురు చదువుపై చూపిన పట్టుదల, శ్రమ, నిబద్ధత చూసి నేను గర్వపడుతున్నాను. తల్లి కష్టాన్ని, కూతురు పట్టుదలతో సమన్వయం చేసుకుంటే ఏ లక్ష్యమైనా సాధించగలం అని నా కూతురు చూపించింది” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ICDS సిబ్బంది CDPO మమత ,EO పవిత్ర ,సినియర్ అసిస్టెంట్ పవన్ , జూనియర్ అసిస్టెంట్ ఆయుబ్ , DCPO హరీష్ ,పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్దినేటర్ మధు కుమార్,FRO కొండయ్య ,మిషన్ శక్తి సిబ్బంది ,సూపర్వైజర్లు, ఆంగన్‌వాడీ సిబ్బంది, మరియు ఇతర సిబ్బంది పాల్గొని ప్రతిభను అభినందించారు.


అందరూ ప్రతిభ విజయాన్ని ప్రశంసిస్తూ, ఆమె భవిష్యత్తు మరింత వెలుగొందాలని ఆకాంక్షించారు.