#అంతర్జాతీయం #world

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ-కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి

అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ, ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాష్కో పైరో జాతి

బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది.

పెరు సమీపంలోని Las Piedras River లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాష్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఇంటర్నెట్ రాగానే పోర్న్ కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు, తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తంచేసారు.

source: whatsup

Leave a comment

Your email address will not be published. Required fields are marked *