# Tags
#తెలంగాణ

భూపాలపల్లిలో నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ దారుణ హత్య!

భూపాలపల్లి : (గుజ్జెటి శ్రీనివాస్)

భూపాలపల్లిలో దారుణ హత్య. నడిరోడ్డుపై సోషల్ ఆక్టివిస్ట్ ను పొడిచి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.

జిల్లా కేంద్రం భూపాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ భర్త, సోషల్ ఆక్టివిస్ట్ రాజలింగమూర్తి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబెడ్కర్ సెంటర్ కు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సెంటర్ నుంచి తను నివాసం ఉండే రెడ్డికాలని కి వెళుతుండగా దుండగులు మారణాయుదాలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడగా, ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయిన అతన్ని ఆసుపత్రికి తరలించగా , పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు.

మృతుడు , కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు లపై ఫిర్యాదు చేయడంతో వార్తల్లో ప్రధానంగా నిలిచాడు. అంతే కాకుండా భూపాలపల్లి పట్టణంతో పాటు సమీపంలో ఉన్న అనేక ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుండగా , సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు సేకరించి ఆయా భూములు అన్యాక్రాంతం కాకుండా చూసినట్టు సమాచారం.

హంతకులు ఎవరు, హత్యకు గల కారణాలు ఏమిటనేది తేలాల్సి ఉంది….