# Tags
#తెలంగాణ

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

రాజన్న సిరిసిల్ల జిల్లా: sampath p

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లో డిజే లకు అనుమతి లేదు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

శనివారం సాయంత్రం పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ ,సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
గణేష్ నిమజ్జనోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,భక్తులు, మండపాల నిర్వహకులు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలన్నారు.
నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదనీ, గణేష్ మండపాల నిర్వహకులు ఆలస్యం చేయకుండా నిర్దేశించిన సమయనికి నిమజ్జనం పూర్తి చేయాలన్నారు.

శోభాయాత్ర సమయంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినెల పాటలు పెట్టినా , బాణాసంచా కలుస్తూ ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవు అన్నారు.

మద్యపానం సేవించి శోభాయాత్రలో ఇతరులకు ఇబ్బందులు గురిచేస్తే చర్యలు తప్పవనీ తెలిపారు.

జిల్లాలో మొత్తం 2200 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 400, వేములవాడ పట్టణంలో 300, ఆయా మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం దాదాపు 2200 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని, వేడుకలు ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, మొగిలి ,సిబ్బంది ఉన్నారు.