# Tags
#తెలంగాణ #జగిత్యాల

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం

అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో AAA ABACUS ఉచిత టీచర్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఆదివారం పొన్నాల గార్డెన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్స్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

ఈ ఒక్కరోజు శిక్షణలో, బేసిక్ ఫండమెంటల్ ఇన్ అబాకస్ మరియు అబాకస్ లెవెల్ వన్ నేర్పించబడింది. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. శిక్షణ అనంతరం, వారు క్యాలిక్యులేటర్ కంటే వేగంగా లెక్కలు చేసి, “మాకు మేమే నమ్మలేకుండా ఉన్నాము” అని తెలియజేశారు.

చార్టెడ్ అకౌంటెంట్ రాము ఈ శిక్షణ ప్రతి విద్యార్థికి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గణిత ఉపాధ్యాయుడు రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు పది చేతివేళ్లపై లెక్కలు చేయడం సులభంగా నేర్పించడం అద్భుతమని కొనియాడించారు.

గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గంగాధర్ ఈ కార్యక్రమం విద్యార్థుల ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు..