# Tags
#జాతీయం #తెలంగాణ

జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో  కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆశీర్వాద్ సక్సేనా

ఒడిశాలోని పూరి : హైదరాబాద్

ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ జట్టు పాల్గొంటోంది.  

జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ 2వ రోజున ఆదివారం తెలంగాణ రాష్ట్ర సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా అండర్ 100 కిమీ. మాస్ స్టార్ట్ రేస్‌లో పాల్గొని 23 ఏళ్లలోపు విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

ఆశీర్వాద్ సక్సేనా, హైదరాబాద్ జిల్లాకు చెందిన అంతర్జాతీయ సైక్లిస్ట్ మరియు మన రాష్ట్రానికి చెందిన అత్యంత అంకితభావం గల క్రీడాకారుడు.

మన రాష్ట్రమైన తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కమిటీ సభ్యులు మరియు  తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయకాంత్ రావు అంతర్జాతీయ సైక్లిస్ట్, కాన్స్య పతక విజేత ఆశీర్వాద్ సక్సేనాకు అభినందనలు తెలిపారు.

శుభాకాంక్షలు :

తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచిన జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో  కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న చి. “ఆశీర్వాద్ సక్సేనా” కు “తెలంగాణ రిపోర్టర్” జాతీయ దినపత్రిక, www.telanganareporters.com మరియు @Telangana Reporter  శుభాకాంక్షలు అందజేస్తుంది.