# Tags
#తెలంగాణ #జగిత్యాల

దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు అభయ్ రాజ్ ప్రదర్శన ఎంపిక


రాయికల్,ఎస్.శ్యామ్ సుందర్ :

:రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అభయ్ రాజ్ రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు శుక్రవారం సాయంత్రం ఎంపికైంది.

కామారెడ్డి జిల్లాలోని విద్యా నికేతన్ పాఠశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రూపొందించిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది.

అత్యంత ప్రతిభ చూపిన అభయ్ రాజ్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అభినందించి ప్రశంసా పత్రం అందజేసారు.

ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాశాఖాధికారి రాము నాయక్, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, మండల విద్యాధికారి రాఘవులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గుమ్మడి సంతోష్, ఉప సర్పంచ్ కొడిమ్యాల శేఖర్, ప్రధానోపాధ్యాయులు దేవలక్ష్మి తదితరులు అభినందించారు.