# Tags

మహర్షి పాఠశాల ముందు ఏబీవీపీ ఆందోళన-మనోజ్ఞ మృతికి యాజమాన్యందే బాధ్యత

రాజన్న సిరిసిల్ల జిల్లా : (తెలంగాణ రిపోర్టర్) సంపత్ కుమార్ పంజ..

ముస్తాబాద్ మండల కేంద్రంలో మహర్షి పాఠశాల డ్రైవర్ నిర్లక్ష్యంతో, ఆ పాఠశాలకు చెందిన బస్సు టైరు మనోజ్ఞ అనే విద్యార్థిని తలపై నుండి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందిన దుర్ఘటన జరిగింది.. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ… మహర్షి పాఠశాలలో యాజమాన్యం మరియు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మరణింంచిందని, వెంటనే పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ మహర్షి పేరిట ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నారని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన పాప మనోజ్ఞ కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ బస్ లపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక పాఠశాలలు కనీస వసతులు లేక ఎలాంటి పర్మిషన్ లేకుండా బస్ లకు ఫిట్ నెస్ లేకుండా నడుస్తున్నాయని,అధికారులు పాటించుకోకుండా వారి నిర్లక్ష్యం తోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.జిల్లా విద్యాశాఖ అధికారులపై మరియు రవాణా శాఖ అధికారూలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు, లా ఫోరమ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, శ్రీనివాస్, కిషోర్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.