మంచిర్యాలలో చోళ మండల్ హోమ్ లోన్ ఫైనాన్ లో భారీ మోసం : ఏసీపీ ప్రకాష్

మంచిర్యాల

మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు తో కలిసి బుధవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

మంచిర్యాల 09-01-2025 రోజున ఏం ఎస్ చోళ మండలం ఇన్వెస్ట్మెంట్, అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హోసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్ నందు 1,39,90,000/- (ఒక కోటి ముప్పైతొమ్మిది లక్షల, తొంబై వేల రూపాయలు ) మోసం జరిగినదన్న పిర్యాదు మేరకు ఇన్స్ పెక్టర్ ఎస్.ప్రమోద్ రావు కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా అదే కంపెనీ లో పనిచేసే మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, మరియు కరీంనగర్ ఏరియా లో ఏ సి ఏం గా పనిచేసే చిట్టెటి అశోక్ రెడ్డి లు ఒక పథకం ప్రకారం కత్తేరాశాల మరియు కిష్టంపేట గ్రామానికి చెందిన (06) గురు చనిపోయిన వారి పేర్ల మీద అనగా 1) చేతేల్లి సమ్మయ్య పేరు మీద 25,90,000/- 2) చల్ల రామయ్య పేరు మీద 20,00,000/- 3) చేతేల్లి చిన్న బక్కయ్య పేరు మీద 20,00,000/- 4)దోమల సారమ్మ పేరు మీద 24,00,000/- 5) చల్ల రవీందర్ పేరుమీద 25,00,000/- 6) బొజ్జ మల్లయ్య పేరు మీద 25,00,000/- మొత్తం 1,39,90,000/- రూపాయలను చనిపోయిన వారి పేర్ల మీద లోన్స్ పంపిణి చేసి, అవే డబ్బులను పై నేరస్థులు బ్యాంకు నుండి డ్రా చేసి తమ స్వంతానికి వాడుకున్నారని విచారణలో తెలిసింది,

మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి ని అరెస్ట్ చేయడం జరిగిందని ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *