#తెలంగాణ

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి-
ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ వాఖ్యలు సరికాదు
* కాంగ్రెస్ శ్రేణుల ప్రెస్ మీట్
* పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

రాయికల్ : (S.Shyamsunder)

పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలనీ,
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కౌశిక్ రెడ్డి వాఖ్యలు సరికావని మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షలు కొండపల్లి రవిందర్ రావు అన్నారు.

పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ జెఎసి ప్రెస్ క్లబ్ లో సోమవారం ప్రెస్ మీట్ లో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షలు కొండపల్లి రవిందర్ రావు మాట్లాడుతు… ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచితంగా వ్యవహరించడం, పరుష పదజాలంతో మాట్లాడడాన్ని త్రీవంగా ఖండించారు.

పార్టీ మార్చుతు గుండాయిజమ్ ప్రదర్శిస్తున్న తీరు పట్ల ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని…. సంజయ్ కుమార్ ఎదుగుదలను ఓర్వలేక పోతున్నారని అన్నారు.

మున్సిపల్ చెర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతు… ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై దాడి చెయ్యడం పట్ల చట్ట పరంగా చర్యలుతీకోవాలని ప్రజాస్వామ్యవాదులందరు ఈ సంఘటనను హర్షించరని అన్నారు.

కోల శ్రీనివాస్ మాట్లాడుతు.. జగిత్యాల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పై దాడి చెయ్యడం వ్యతిరేకిస్తున్నామని ప్రతి సారి ఉనికి కోసం కౌశిక్ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నాడని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజారెడ్డి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి,, నాయకులు రవిందర్ రెడ్డి తిరుపతి గౌడ్ శ్రీనివాస్ సమల్ల శ్రీనివాస్ బెజ్జంకి మోహన్ పళ్ళికొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *