# Tags
#తెలంగాణ

మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు చేస్తే చర్యలు తప్పవు: సీఐ శ్రీనివాస్ గౌడ్

రాజన్న సిరిసిల్ల జిల్లా.

ప్రజలెవరూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేయరాదు, ఫార్వర్డ్ చేయరాదు: సీఐ శ్రీనివాస్ గౌడ్

రానున్న పండుగల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫెక్ మెసేజ్ లు వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్ లు చేయడం,ఫార్వార్డ్ చేయడం చేయవద్దని, ఒకవేళ ఎవరైనా ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్ చేసిన పోస్ట్ చేసిన వారితో పాటుగా గ్రూప్ ఆడ్మిన్ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయిని సీఐ  తెలిపారు.

ప్రతి ఒక్కరు ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా  సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల సంరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని  తెలిపారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *